శారీ’ ముఖ్యమైన రోల్ చేసిన సినిమా ఇది: వర్మ

నేటి భారత్ న్యూస్ – రామ్ గోపాల్ వర్మ సమర్పణలో .. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వంలో ‘శారీ’ సినిమా రూపొందింది. ఈ సినిమా ద్వారా కథానాయికగా ఆరాధ్యదేవి తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ .. “ఇది ఒక సైకలాజికల్ థిల్లర్. ఈ జోనర్ కీ .. టైటిల్ కి పొంతన లేనట్టుగా అనిపిస్తుంది. కానీ రెండిటికీ సంబంధం ఉంది. కథ అంతా కూడా ‘ శారీ’ చుట్టూనే తిరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కథలో ‘శారీ’ రోల్ ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. అందువల్లనే ఈ సినిమాకి ఈ టైటిల్ ను సెట్ చేసుకోవడం జరిగింది” అని అన్నారు. “అతను ఒక ఫొటోగ్రఫర్ .. ఈ అమ్మాయిని అతను ‘శారీ’లో చూస్తాడు. ఆమె పేరు కూడా అతనికి తెలియదు .. ‘శారీ’ అమ్మాయిగానే గుర్తుపెట్టుకుంటాడు. అప్పటి నుంచి ఆమెను ఫాలో కావడం మొదలుపెడతాడు. రాజమండ్రిలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఆధారంగా ఈ కథను రెడీ చేసుకున్నాను. నేను బిజీగా ఉండటం వలన .. కమల్ పై గల నమ్మకంతో దర్శకత్వం బాధ్యత ఆయనకు అప్పగించాను” అని అన్నారు.

  • Related Posts

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌