పన్నుల రూపంలో భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం: రేవంత్ రెడ్డి

నేటి భారత్ న్యూస్– పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రతిపాదించిన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. డీఎంకే ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు రాజకీయపరమైన పరిమితులు విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానతకు దారితీస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పారదర్శకంగా లేని ఈ విధానంపై బీజేపీని నిలువరించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. లోక్‌సభ సీట్లను పెంచకుండా రాష్ట్రాల్లో అంతర్గత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో 1976లో సీట్లను పెంచకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టారని గుర్తు చేశారు. జనాభా ఆధారిత పునర్విభజన ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాదిని ఉత్తరాది రాష్ట్రాలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను ఆమోదించవద్దని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని అంగీకరించబోమని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ వేగవంతమైన ఆర్థికాభివృద్ధిని సాధించిందని, జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో వృద్ధిని నమోదు చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సుపరిపాలనతో పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా చెల్లింపులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రూపాయి చెల్లిస్తే తెలంగాణకు 42 పైసలు, తమిళనాడుకు 26 పైసలు, కర్ణాటకకు 16 పైసలు, కేరళకు 49 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని ఆయన తెలిపారు. అదే బీహార్‌కు రూ.6.06, ఉత్తరప్రదేశ్‌కు రూ.2.03, మధ్యప్రదేశ్‌కు రూ.1.73 మేర తిరిగి వస్తున్నాయని ఆయన వివరించారు.

Related Posts

రేవంత్ రెడ్డి అప్పుడు, ఇప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై ఏడుస్తున్నారు: హరీశ్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై విమర్శలు చేశారని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ శాసనసభకు హాజరుకాకపోవడం వల్ల నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కావడం లేదని గజ్వేల్…

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

నేటి భారత్ న్యూస్-‘‘మూడేళ్ల తర్వాత అధికారం మనదే. అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా, అప్పటి వరకు ధైర్యంగా ఉండు’’ అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్‌కు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

రేవంత్ రెడ్డి అప్పుడు, ఇప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై ఏడుస్తున్నారు: హరీశ్ రావు

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి నారా లోకేశ్

రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి నారా లోకేశ్

నేపాల్‌లో వివాహ వయసు 20 నుంచి 18కి తగ్గింపు!

నేపాల్‌లో వివాహ వయసు 20 నుంచి 18కి తగ్గింపు!

మ‌హేంద్రుడా మ‌జాకా… వింటేజ్ ధోనీని గుర్తు చేశాడుగా..

మ‌హేంద్రుడా మ‌జాకా… వింటేజ్ ధోనీని గుర్తు చేశాడుగా..

 నేడు ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి ఆశవర్కర్ల పిలుపు .. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు

 నేడు ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి ఆశవర్కర్ల పిలుపు .. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు