ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

నేటి భారత్ న్యూస్- లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని, డీలిమిటేషన్‌ను ప్రశ్నించని పక్షంలో చరిత్ర తమను క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని రాష్ట్రాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. డీలిమిటేషన్ కారణంగా తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ఆధారంగా సీట్లు పెంచడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. ఈ విధానాన్ని అవలంబిస్తే అనేక నష్టాలు జరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ విధానాన్ని అనుసరించడం ద్వారా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉందని అన్నారు.

Related Posts

రేవంత్ రెడ్డి అప్పుడు, ఇప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై ఏడుస్తున్నారు: హరీశ్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై విమర్శలు చేశారని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ శాసనసభకు హాజరుకాకపోవడం వల్ల నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కావడం లేదని గజ్వేల్…

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

నేటి భారత్ న్యూస్-‘‘మూడేళ్ల తర్వాత అధికారం మనదే. అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా, అప్పటి వరకు ధైర్యంగా ఉండు’’ అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్‌కు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

రేవంత్ రెడ్డి అప్పుడు, ఇప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై ఏడుస్తున్నారు: హరీశ్ రావు

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి నారా లోకేశ్

రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి నారా లోకేశ్

నేపాల్‌లో వివాహ వయసు 20 నుంచి 18కి తగ్గింపు!

నేపాల్‌లో వివాహ వయసు 20 నుంచి 18కి తగ్గింపు!

మ‌హేంద్రుడా మ‌జాకా… వింటేజ్ ధోనీని గుర్తు చేశాడుగా..

మ‌హేంద్రుడా మ‌జాకా… వింటేజ్ ధోనీని గుర్తు చేశాడుగా..

 నేడు ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి ఆశవర్కర్ల పిలుపు .. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు

 నేడు ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి ఆశవర్కర్ల పిలుపు .. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు