వడగళ్ల వానతో పంట నష్టం…. ఆరాతీసిన సీఎం చంద్రబాబు

నేటి భారత్ న్యూస్- అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంట నష్టపోయి తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లిలో జరిగిన ఈ సంఘటనపై ఆయన జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా, ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. మరింత మెరుగైన చికిత్స కోసం వారిని అనంతపురం తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా జరిగిన పంట నష్టంపై సమగ్ర సమీక్ష జరిపారు. కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లోని 40 గ్రామాలలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు నివేదించారు. దాదాపు 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వారు వివరించారు. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని, ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రైతులు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Related Posts

 8.5 కోట్ల విలువైన చిత్రాన్ని రూ.వెయ్యికే సొంతం చేసుకున్న మహిళ.. పొరపాటుకు చింతిస్తున్న వేలం నిర్వాహకులు

నేటి భారత్ న్యూస్- ప్రముఖ చిత్రకారులు వేసిన పురాతన పెయింటింగ్ లను వేలంలో అమ్మడం మనం చూస్తూనే ఉంటాం.. అలాంటి వేలంలో పాల్గొన్న ఒక అమెరికన్ మహిళ తెలియకుండానే జాక్ పాట్ కొట్టేసింది. వేలంలో ఉంచిన ఓ చిత్రాన్ని 12 డాలర్లకు…

 సంక్షేమ సారధి ఎన్టీఆర్… అభివృద్ధి ప్రదాత చంద్రన్న: మంత్రి నారా లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- పసుపు జెండా మనకు ఎమోషన్… 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూశాం. మరెన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించని కేడర్ మనకు మాత్రమే సొంతమని తెలుగుదేశం పార్టీ జాతీయ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 8.5 కోట్ల విలువైన చిత్రాన్ని రూ.వెయ్యికే సొంతం చేసుకున్న మహిళ.. పొరపాటుకు చింతిస్తున్న వేలం నిర్వాహకులు

 8.5 కోట్ల విలువైన చిత్రాన్ని రూ.వెయ్యికే సొంతం చేసుకున్న మహిళ.. పొరపాటుకు చింతిస్తున్న వేలం నిర్వాహకులు

 సంక్షేమ సారధి ఎన్టీఆర్… అభివృద్ధి ప్రదాత చంద్రన్న: మంత్రి నారా లోకేశ్‌

 సంక్షేమ సారధి ఎన్టీఆర్… అభివృద్ధి ప్రదాత చంద్రన్న: మంత్రి నారా లోకేశ్‌

 పట్టాలపై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. సెల్‌ఫోన్ వెలుగు కాపాడింది!

 పట్టాలపై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. సెల్‌ఫోన్ వెలుగు కాపాడింది!

 ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లలో తనిఖీలు.. వేలాది నకిలీ వస్తువుల సీజ్

 ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లలో తనిఖీలు.. వేలాది నకిలీ వస్తువుల సీజ్

 ఎట్టకేలకు ముగిసిన ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ

 ఎట్టకేలకు ముగిసిన ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ

మ‌య‌న్మార్‌, థాయ్‌లాండ్‌లో పెను విప‌త్తు… 1000 దాటిన మృతుల సంఖ్య‌

మ‌య‌న్మార్‌, థాయ్‌లాండ్‌లో పెను విప‌త్తు… 1000 దాటిన మృతుల సంఖ్య‌