14 ఏళ్ల బాలుడి ఘాతుకం.. దొంగ‌త‌నం ఎందుకు చేశావ్? అని మందలించినందుకు తండ్రినే చంపేశాడు!

నేటి భారత్ న్యూస్ – దొంగ‌త‌నం ఎందుకు చేశావ్‌? అని మైన‌ర్ అయిన కుమారుడిని ప్ర‌శ్నించి.. కాస్త మంద‌లించ‌డమే ఆ తండ్రి చేసిన పాప‌మైంది! కోపం పెంచుకున్న ఆ కుమారుడు ఏకంగా క‌న్న‌తండ్రి ప్రాణాలు తీసేందుకు ప‌థ‌కం వేశాడు. ఇంట్లోని  ఓ గ‌దిలో  నిద్రిస్తున్న తండ్రికి నిప్పు పెట్టాడు. మంట‌ల‌కు తాళ‌లేక బాధితుడు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించ‌గా .. అందుకు వీల్లేకుండా ఆ గ‌దికి బ‌య‌ట నుంచి త‌లుపులు బిగించాడా కుమారుడు. దీంతో ఆ గ‌దిలోనే ఆ తండ్రి స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యాడు. ఈ హృద‌య విదార‌క‌మైన ఘ‌ట‌న‌ హర్యానాలోని ఫ‌రీదాబాద్ ‌లో జ‌రిగింది. మృతుడు 55 ఏళ్ల ఆలం అన్సారీ. నిందితుడు 14 ఏళ్ల అత‌డి కుమారుడు. ఫ‌రీదాబాద్‌లోని ఓ ఇంట్లో అన్సారీ, అత‌డి 14 ఏళ్ల కుమారుడు అద్దెకు ఉంటున్నారు. మంగ‌ళ‌వారం త‌న ష‌ర్టు జేబులోంచి డ‌బ్బులు తీయ‌డంతో కుమారుడిని అన్సారీ తిట్టాడు. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత 1:30 గంట‌ల‌కు గ‌దిలోంచి అరుపులు వినిపించ‌డంతో స్థానికులు వెళ్లి చూసేస‌రికే అత‌డు ప్రాణాలు విడిచాడు. స్థానికులు చూస్తుండ‌గానే ఆ కుమారుడు ఇంటి గోడ దూకి పారిపోయాడు. కొద్దిసేప‌టికే బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

  • Related Posts

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌