మ‌హేంద్రుడా మ‌జాకా… వింటేజ్ ధోనీని గుర్తు చేశాడుగా..

నేటి భారత్ న్యూస్- ఆదివారం చెన్నైలోని ఎం.ఏ చిదంబరం స్టేడియంలో ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ)తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) విజయం సాధించి ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో శుభారంభం చేసింది. మొద‌ట బౌలింగ్‌లో అద‌ర‌గొట్టిన సీఎస్‌కే, ఆ త‌ర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. ముంబ‌యి నిర్దేశించిన 156 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి, మ‌రో ఐదు బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై మాజీ సార‌థి మహేంద్ర సింగ్‌ ధోనీ వికెట్ల వెనుక మ‌రోసారి త‌న మ్యాజిక్ చూపించాడు. కేవ‌లం 0.12 సెకన్ల‌ మెరుపు వేగంతో స్టంపౌట్ చేసి వింటేజ్ ధోనీని గుర్తు చేశాడు. ముంబ‌యి ఇన్నింగ్స్ 11వ ఓవ‌ర్‌లో సీఎస్‌కే బౌల‌ర్ నూర్ అహ్మ‌ద్ వేసిన బంతిని వికెట్ల వెనుక అత్యంత వేగంగా అందుకున్న ధోనీ క్షణాల్లో బెయిల్స్‌ను గిరాటేశాడు. దీంతో ఎంఐ కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ క్రీజును వీడాల్సి వ‌చ్చింది. ఈ మ్యాజిక‌ల్ స్టంపింగ్ తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. వికెట్ల వెనుక‌ ధోనీ ఉంటే బ్యాట‌ర్ల‌కు ద‌డే అని అత‌ని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.  

Related Posts

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని…

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

నేటి భారత్ న్యూస్- హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇక్కడి కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న ‘ఆనం మీర్జా’ ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుకాణదారుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.