ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

నేటి భారత్ న్యూస్-‘‘మూడేళ్ల తర్వాత అధికారం మనదే. అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా, అప్పటి వరకు ధైర్యంగా ఉండు’’ అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్‌కు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అభయమిచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో రెండో నిందితుడైన సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు రెండ్రోజుల క్రితం పులివెందుల పోలీసులు పవన్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ‘వైఎస్ అవినాశ్ అన్న యూత్’ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న పవన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.ఈ నేపథ్యంలో నిన్న పులివెందులలో పర్యటించిన జగన్‌ను పవన్ కుమార్‌ కలిశారు. విచారణ పేరుతో డీఎస్పీ, సీఐ తనను కొట్టారంటూ ఫిర్యాదు చేశారు. స్పందించిన జగన్ ఆయనను ఓదార్చారు. మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి రాగానే  ఆ డీఎస్పీ, సీఐతో సెల్యూట్ కొట్టిస్తానని, అంతవరకు ధైర్యంగా ఉండాలని కోరారు. కాగా, నేడు మరోమారు విచారణకు రావాలంటూ పవన్‌కుమార్‌కు పోలీసులు ఇప్పటికే 41ఏ నోటీసులు ఇచ్చారు.

Related Posts

 భ‌ద్రాచ‌లంలో ఘోర ప్ర‌మాదం.. కుప్ప‌కూలిన ఆరంత‌స్తుల భ‌వ‌నం

నేటి భారత్ న్యూస్- భ‌ద్రాచ‌లంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. భ‌ద్రాచ‌లం సూప‌ర్ బ‌జార్ సెంటర్‌లో పంచాయ‌తీ కార్యాల‌యం వ‌ద్ద‌ నిర్మాణంలో ఉన్న ఆరంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు మృతిచెంద‌గా, శిథిలాల కింద న‌లుగురు చిక్కుకున్న‌ట్లు స‌మాచారం. ఈ ప్ర‌మాదానికి…

ఎంఎంటీఎస్ రైలు అత్యాచారయత్నం, ఉప ఎన్నికల అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి

నేటి భారత్ న్యూస్- ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచారయత్నం ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనను చూపిస్తూ బీఆర్ఎస్ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 భ‌ద్రాచ‌లంలో ఘోర ప్ర‌మాదం.. కుప్ప‌కూలిన ఆరంత‌స్తుల భ‌వ‌నం

 భ‌ద్రాచ‌లంలో ఘోర ప్ర‌మాదం.. కుప్ప‌కూలిన ఆరంత‌స్తుల భ‌వ‌నం

ఎంఎంటీఎస్ రైలు అత్యాచారయత్నం, ఉప ఎన్నికల అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి

ఎంఎంటీఎస్ రైలు అత్యాచారయత్నం, ఉప ఎన్నికల అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి

 చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌!

 చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌!

మేడిగడ్డ బ్యారేజీ, ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

మేడిగడ్డ బ్యారేజీ, ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

 పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి… చంద్రబాబు కీలక ఆదేశాలు

 పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి… చంద్రబాబు కీలక ఆదేశాలు

 ఐపీఎల్‌లో ర‌షీద్ ఖాన్ అరుదైన ఘ‌న‌త‌.. జస్ప్రీత్ బుమ్రాను అధిగమించిన స్పిన్న‌ర్‌!

 ఐపీఎల్‌లో ర‌షీద్ ఖాన్ అరుదైన ఘ‌న‌త‌.. జస్ప్రీత్ బుమ్రాను అధిగమించిన స్పిన్న‌ర్‌!