తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. యోగా టీచర్‌ను ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టిన భర్త!

నేటి భారత్ న్యూస్- తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో యోగా టీచర్‌ను ఓ వ్యక్తి ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టాడు. హర్యానాలోని చక్రి దాద్రిలో జరిగిందీ ఘటన. బాధితుడు జగదీప్ రోహ్‌తక్‌లోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో యోగా టీచర్. ఆయనను కిడ్నాప్ చేసిన నిందితుడు ఏడుగుల గొయ్యి తీసి అందులో ఆయనను సజీవంగా పాతిపెట్టాడు. మూడు నెలల తర్వాత ఈ నెల 24న జగదీప్‌ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.  పోలీసుల కథనం ప్రకారం.. డిసెంబర్ 24న జగదీప్‌ ఇంటికి వస్తుండగా నిందితుడు ఆయనను కిడ్నాప్ చేశాడు. కాళ్లు, చేతులు కట్టేశాడు. ఆపై అరవకుండా నోటికి ప్లాస్టర్ వేశాడు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అప్పటికే సిద్ధం చేసిన గోతిలో ఆయనను సజీవంగా పాతిపెట్టాడు. జగదీప్ కనిపించడం లేదంటూ కేసు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఆయన కాల్ రికార్డులను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులు ధర్మపాల్, హర్‌దీప్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా నిందితుడు భయంకరమైన నిజాలను వెల్లడించాడు. నిందితుడు ఉంటున్న భవనంలోనే జగదీప్ అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో నిందితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతిమంగా ఇది ఆయన హత్యకు దారితీసింది. 

Related Posts

భర్తను అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేసిన ముస్కాన్..

నేటి భారత్ న్యూస్- సంచలనం సృష్టించిన మీరట్ హత్య కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. కన్నబిడ్డ పుట్టిన రోజు కోసం లండన్ నుంచి వచ్చిన భర్త సౌరభ్‌ను ప్రియుడు సాహిల్‌ శుక్లాతో కలిసి దారుణంగా హతమార్చిన ముస్కాన్ రస్తోగి 11…

 జాతరలో అసభ్య చేష్టలు.. వారించిన మహిళా ఎస్సై జుట్టు పట్టుకొని కొట్టిన యువకులు

నేటి భారత్ న్యూస్- ఓ జాతరలో అసభ్య నృత్యాలను అడ్డుకున్న మహిళా ఎస్సైపై కొందరు యువకులు దాడిచేసి, ఆమె జుట్టు పట్టుకొని కొట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిందీ ఘటన.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!