జ‌పాన్ అభిమానుల ప్రేమ‌కు తార‌క్ ఫిదా.. ఆస‌క్తిక‌ర వీడియో షేర్ చేసిన హీరో!

నేటి భారత్ న్యూస్- జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌కు జ‌పాన్‌లో మంచి క్రేజ్‌ ఉన్న విష‌యం తెలిసిందే. అక్క‌డ విడుద‌లైన తార‌క్‌ గ‌త‌ చిత్రాలు ‘బాద్‌షా’, ‘ఆర్ఆర్ఆర్’ మంచి వ‌సూళ్లు సాధించాయి. ఈ నేపథ్యంలోనే ‘దేవ‌ర’ సినిమాను మేక‌ర్స్ జ‌పాన్‌లో ఈ నెల 28న గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌బోతున్నారు.  ఈ సంద‌ర్భంగా జపాన్‌ వెళ్లిన ఎన్‌టీఆర్‌, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ.. జ‌పాన్ అభిమానుల‌ను క‌ల‌వ‌డంతో పాటు అక్క‌డి స్థానిక మీడియాల‌లో ‘దేవ‌ర’ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గోంటున్నారు. ఈ క్ర‌మంలో జ‌పాన్ అభిమానుల ప్రేమ‌కు ఫిదా అయిన తార‌క్ తాజాగా వారితో ఉన్న ఒక వీడియోను త‌న ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా పంచుకున్నారు.  “మీ ప్రేమ‌తో నా మ‌న‌సు నిండిపోయింది. జపనీస్ ప్రేక్షకులు మార్చి 28 నుంచి సినిమా హాళ్లలో ‘దేవర’ని అనుభవించడానికి నేను వేచి ఉండలేను” అంటూ రాసుకోచ్చారు. ఇక దేవర పార్టు 1 గ‌తేడాది సెప్టెంబర్ ‌27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై హిట్‌ టాక్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అలాగే దాదాపు రూ.500 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ కూడా రాబ‌ట్టింది.

Related Posts

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని…

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

నేటి భారత్ న్యూస్- హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇక్కడి కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న ‘ఆనం మీర్జా’ ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుకాణదారుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!