ఐపీఎల్‌లో ర‌షీద్ ఖాన్ అరుదైన ఘ‌న‌త‌.. జస్ప్రీత్ బుమ్రాను అధిగమించిన స్పిన్న‌ర్‌!

నేటి భారత్ న్యూస్- ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ)కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ ఆఫ్ఘ‌నిస్థాన్ స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అత్యంత వేగంగా 150 వికెట్ల మైలురాయిని చేరుకున్న బౌల‌ర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)తో నిన్న రాత్రి జరిగిన జీటీ సీజన్ ఓపెనర్ మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనత సాధించాడు. అత‌డు కేవ‌లం 122 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు పడగొట్ట‌డం విశేషం. ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) బౌల‌ర్‌ జస్ప్రీత్ బుమ్రాను అధిగమించి ర‌షీద్‌ ఈ మైలురాయిని అందుకున్నాడు. బుమ్రా 124 మ్యాచ్‌ల్లో ఈ ఘ‌న‌త సాధించాడు. కాగా, ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో లసిత్ మలింగ (105), యుజ్వేంద్ర చాహల్ (118) ఉన్నారు. కాగా, అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల లిస్టులో 205 వికెట్ల‌తో చాహ‌ల్ అగ్ర‌స్థానంలో ఉంటే… ర‌షీద్ 11వ స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన ఐపీఎల్ 5వ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ)ను పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) 11 ప‌రుగుల తేడాతో మ‌ట్టిక‌రిపించిన విష‌యం తెలిసిందే. మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 243 ప‌రుగులు చేసింది. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (97 నాటౌట్‌) భారీ ఇన్నింగ్‌కు తోడు ఇత‌ర బ్యాట‌ర్లు కూడా రాణించ‌డంతో గుజ‌రాత్ భారీ స్కోర్ న‌మోదు చేసింది. ఆ త‌ర్వాత 244 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌తో బ్యాటింగ్ ప్రారంభించిన‌ గుజ‌రాత్ 232 ప‌రుగులే చేయ‌గ‌లిగింది. 

Related Posts

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని…

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

నేటి భారత్ న్యూస్- హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇక్కడి కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న ‘ఆనం మీర్జా’ ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుకాణదారుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!