కేటీఆర్ ఫొటో పెట్టుకున్నందుకు సిరిసిల్లలో టీస్టాల్ మూసివేయించారు… యజమాని ఆవేదన

నేటి భారత్ న్యూస్ – ట్రేడ్ లైసెన్స్ లేకపోవడంతో చర్యలు తీసుకున్నామని అధికారుల వివరణ
కేటీఆర్ ఫొటో తీసేయడానికి నిరాకరించడంతో కక్ష కట్టారని ఓనర్ ఆరోపణ
నాలుగేళ్లుగా అక్కడే, అదే పేరుతో టీ స్టాల్ నడుపుతున్నట్లు వెల్లడి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేరు, ఫొటో పెట్టుకున్నందుకు అధికారులు తన టీ స్టాల్ మూసివేయించారని సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తి ఆరోపించారు. కలెక్టర్ కక్ష గట్టి తన టీస్టాల్ బలవంతంగా మూసివేయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ నగరంలోని బతుకమ్మ ఘాట్ లో టీ స్టాల్ పెట్టుకుని జీవిస్తున్నారు. కేటీఆర్ మీద అభిమానంతో తన టీ స్టాల్ కు ఆయన పేరే పెట్టుకున్నానని, ఆయన ఫొటోలను ఏర్పాటు చేసుకున్నానని చెప్పారు. గత నాలుగేళ్లుగా అదే ప్రాంతంలో టీ స్టాల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపారు. ఇటీవల మున్సిపల్ అధికారులు టీ స్టాల్ వద్దకు వచ్చి కేటీఆర్ ఫొటో తొలగించాలని చెప్పారన్నారు. టీస్టాల్ లేకపోయినా పర్వాలేదు కానీ తాను మాత్రం కేటీఆర్ ఫొటో తొలగించబోనని చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహించి తన టీ స్టాల్ ను బలవంతంగా మూసివేయించాడని ఆరోపించారు. సిరిసిల్లలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదంటూ బత్తుల శ్రీనివాస్ మీడియా ముందు వాపోయారు. కాగా, ఈ విషయంపై మున్సిపల్ అధికారులు వివరణ ఇస్తూ… టీ స్టాల్ కు ట్రేడ్ లైసెన్స్ లేదని చెప్పారు. లైసెన్స్ లేకుండా నడుపుతున్నందుకే టీ స్టాల్ ను మూసివేయించామని వివరించార

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌