విమానంలో బీడీ తాగుతూ ప‌ట్టుబ‌డ్డ ప్ర‌యాణికుడు

నేటి భారత్ న్యూస్- సూర‌త్ నుంచి కోల్‌క‌తా వెళుతున్న విమానంలో షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. ఓ ప్ర‌యాణికుడు బీడీ తాగుతూ సిబ్బందికి  ప‌ట్టుబ‌డ్డాడు. గురువారం సాయంత్రం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే… సూర‌త్ నుంచి కోల్‌క‌తా వెళ్లాల్సిన‌ విమానంలో సాంకేతిక స‌మ‌స్యలు త‌లెత్త‌డంతో టేకాఫ్ ఆల‌స్య‌మైంది. దాంతో ప్ర‌యాణికులు ఫ్లైట్‌లోనే నిరీక్షిస్తున్నారు.  ఈ క్ర‌మంలో విమానం వాష్‌రూమ్ నుంచి పొగ‌, వాస‌న రావ‌డంతో సిబ్బంది గ‌మ‌నించి ఎయిర్‌పోర్ట్  అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. అధికారులు సోదాలు నిర్వ‌హించ‌గా… బెంగాల్‌కు చెందిన అశోక్ బిశ్వాస్ అనే వ్య‌క్తి బ్యాగ్‌లో బీడీలు, అగ్గిపెట్టె దొరికాయి. అత‌డే వాష్‌రూమ్‌లో బీడీ తాగిన‌ట్లు నిర్ధారించుకున్న అధికారులు బిశ్వాస్‌ను విమానం నుంచి దింపేయ‌డంతో పాటు పోలీసుల‌కు అప్ప‌గించారు. సెక్యూరిటీ అధికారుల క‌ళ్లుగ‌ప్పి అత‌డు నిషేధిత వ‌స్తువుల‌ను విమానంలోకి ఎలా తీసుకొచ్చాడ‌నే విష‌యంపై అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అత‌డిపై కేసు కూడా న‌మోదు చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. 

Related Posts

అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్

నేటి భారత్ న్యూస్- ఆంధప్రదేశ్‌లో రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ నిర్ణయించింది. అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో నెలకొల్పనున్న ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా,…

ఐపీఎల్‌లో కేకేఆర్ అరుదైన ఘ‌న‌త‌.. తొలి జ‌ట్టుగా న‌యా రికార్డ్!

నేటి భారత్ న్యూస్-ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) అరుదైన ఘ‌న‌త సాధించింది. గురువారం స‌న్‌రైజ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 80 ప‌రుగుల తేడాతో గెలిచిన విష‌యం తెలిసిందే. దీంతో కోల్‌క‌తా జ‌ట్టు ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. టోర్నీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్

అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్

ఐపీఎల్‌లో కేకేఆర్ అరుదైన ఘ‌న‌త‌.. తొలి జ‌ట్టుగా న‌యా రికార్డ్!

ఐపీఎల్‌లో కేకేఆర్ అరుదైన ఘ‌న‌త‌.. తొలి జ‌ట్టుగా న‌యా రికార్డ్!

చైనీయులతో ప్రేమ‌, పెళ్లి, శారీరక సంబంధాలు వద్దు: అమెరికా

చైనీయులతో ప్రేమ‌, పెళ్లి, శారీరక సంబంధాలు వద్దు: అమెరికా

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్