ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ లేఖ

నేటి భారత్ న్యూస్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. మేడిగడ్డ బ్యారేజీకి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆ లేఖలో కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇకనైనా విమర్శలు మానుకొని, పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. నీళ్లు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా ప్రాణహిత నుంచి నీటిని ఎత్తిపోసి పంటలకు నీరు అందించాలన్నారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు యాసంగి పంటకు నీళ్లివ్వలేమని గత డిసెంబర్‌లో అధికారులతో ప్రకటన చేయించారని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని వినోద్ కుమార్ అన్నారు. ఇప్పుడేమో రైతు సమితి చైర్మన్ కోదండరెడ్డి పంటలు వేయవద్దని రైతులకు సూచించడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని నీటి సరఫరా వ్యవస్థపై అధికార పార్టీ నాయకులకు అవగాహన లేదని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా పంట దిగుబడి సాధించామని చెబుతున్నారని విమర్శించారు.కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాక మొదటి పదేళ్లు రికార్డుస్థాయిలో పంట దిగుబడిని పెంచితే, కాంగ్రెస్ ఏడాది పాలనలో పంటలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితికి చేరుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు యజమానిగా తెలంగాణ ప్రభుత్వం మరమ్మతులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నేషనల్ అథారిటీ కేవలం సూచనలు, సలహాల కోసమే ఉందని తెలిపారు.లక్ష ఎకరాలకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూడటం సరికాదని ఆయన అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ప్రకారం, ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పేర్కొన్నారు. అథారిటీ సూచనలు మాత్రమే చేస్తుందన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక వచ్చే దాకా నిర్ణయాలు తీసుకోకూడదని భావించడం సరికాదన్నారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌