పెళ్లి చేసుకుంటారా.. ఉద్యోగాన్ని వదులుకుంటారా?..

నేటి భారత్ న్యూస్- ‘పెళ్లి చేసుకుని లక్షణంగా కాపురం చేసుకుంటే ఉద్యోగం ఉంటుంది.. లేదంటే ఉద్యోగంపై ఆశలు వదులుకోండి’ అంటూ చైనాలోని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు హుకుం జారీ చేసింది. చైనాలోని టాప్-50 కంపెనీల్లో ఒకటైన షన్‌టైన్ కెమికల్ గ్రూప్‌లో 1200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో అవివాహితులు, విడాకులు తీసుకున్న వారికి కంపెనీ తాజాగా నోటీసులు ఇచ్చింది. పెళ్లి చేసుకుంటేనే ఉద్యోగం ఉంటుందని, లేదంటే ఉద్యోగం పోతుందని హెచ్చరించింది. తమ సంస్థలో వివాహితుల సంఖ్యను పెంచే ఉద్దేశంతోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తన కథనంలో పేర్కొంది. 28 నుంచి 58 ఏళ్ల మధ్య వయసుండి ఒంటరిగా ఉంటున్న ఉద్యోగులందరూ సెప్టెంబర్‌లోగా వివాహం చేసుకోవాలని, లేదంటే వేరే ఉద్యోగం చూసుకోవాలని హెచ్చరించింది. సెప్టెంబర్ వరకు కూడా వివాహం చేసుకోకుంటే ఉద్వాసన తప్పదని తేల్చి చెప్పింది. షన్‌టైన్ కంపెనీ ఆదేశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీ తన పని తాను చూసుకోకుండా ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబాటు తగదని హితవు పలుకుతున్నారు. పెళ్లి చేసుకోవాలని ఉద్యోగులను ఆదేశించడం వారి స్వాతంత్ర్యాన్ని హరించడమే కాకుండా, రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కంపెనీ తన ఆదేశాలను వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది. 

  • Related Posts

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌