కోటప్పకొండలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

నేటి భారత్ న్యూస్- ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా కోటప్పకొండపై మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కొండపై కొలువై వున్న త్రికోటేశ్వర స్వామికి బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు తొలిపూజ ప్రారంభమైంది. ఆలయ పూజారులు బిందెతీర్థంతో స్వామి వారికి అభిషేకం చేశారు. తొలిపూజకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఎమ్మెల్యే అరవిందబాబు, ఆలయ ఈవో చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు.మూడు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం పోలీసులు ఉపయోగించిన డ్రోన్ ఆలయ క్యాంటీన్ సమీపంలోని విద్యుత్ తీగలపై పడింది. దీంతో ట్రాన్స్ ఫార్మర్ లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు తాత్కాలికంగా క్యాంటీన్ ను మూసివేశారు. అనంతరం విద్యుత్ సరఫరా నిలిపివేసి డ్రోన్ ను కిందికి దించారు. మరమ్మతుల అనంతరం విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌