ఒడిశా బీచ్ కు ప్రత్యేక అతిథులు..

నేటి భారత్ న్యూస్- ఒడిశాలోని గహీర్ మఠ తీరంలో ఏటా వచ్చే ప్రత్యేక అతిథులతో కిటకిటలాడుతోంది. తీరం వెంబడి ఎటుచూసినా ఆలివ్ రిడ్లే తాబేళ్లు కనిపిస్తున్నాయి. గుడ్లు పెట్టే సీజన్ కావడంతో లక్షలాదిగా తాబేళ్లు ఇక్కడికి చేరుకుంటున్నాయి. గడిచిన 12 రోజుల్లో దాదాపు 7 లక్షల ఆలివ్ రిడ్లే తాబేళ్లు గహీర్ మఠ తీరానికి చేరుకున్నాయని భారత మత్స్య పరిశోధన సంస్థ(ఎఫ్‌ఎస్‌ఐ) శాస్త్రవేత్త జీవీఏ ప్రసాద్‌ తెలిపారు. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల నుంచి ఇవి వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఏటా ఈ తీరానికి వస్తాయని వివరించారు. గహీర్ మఠ తీరం సురక్షితమని భావించి ఇక్కడికి ఏటా వస్తాయన్నారు. వెన్నెల రాత్రుల్లో ఇవి తీరంలో గుడ్లు పెడతాయని చెప్పారు. ఒక్కో తాబేలు 50 నుంచి 100 గుడ్లు పెడుతుందని తెలిపారు. కాగా, ఏటా ఈ సీజన్ లో వచ్చే ఈ ప్రత్యేక అతిథుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. తీరంలో చేపల వేటను నిషేధించడంతో పాటు పర్యాటకులను నియంత్రిస్తున్నట్లు వివరించారు. తీరంలో తాబేళ్లు పెట్టే గుడ్లను పరిరక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌