పాకిస్థాన్ కు అంత సీన్ లేదు.. ఐరాసా భేటీలో తేల్చిచెప్పిన భారత్

నేటి భారత్ న్యూస్- జమ్మూకశ్మీర్ లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందంటూ పాకిస్థాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవ హక్కుల మండలి సమావేశంలో పాక్ ప్రతినిధి, ఆ దేశ మంత్రి అజం నజీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండించిన భారత రాయబారి క్షితిజ్ త్యాగి.. ప్రజాస్వామ్యం విషయంలో భారత్ కు చెప్పేంత సీన్ పాక్ కు లేదని కొట్టిపారేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ నీతి వాక్యాలు వల్లించడం మానుకోవాలని హితవు పలికారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాల వల్ల దశాబ్దాలుగా దెబ్బతిన్న జమ్మూకశ్మీర్, లద్దాఖ్ లలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని క్షితిజ్ త్యాగి చెప్పారు. ఆ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని తేల్చిచెప్పారు. మానవ హక్కుల ఉల్లంఘనకు, మైనారిటీలపై వేధింపులకు పేరొందిన పాకిస్థాన్ ఈ విషయంలో ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదమని అన్నారు. భారత్ కే కాదు మరే దేశానికీ సలహాలు ఇచ్చే స్థాయి పాకిస్థాన్ కు లేదన్నారు. భారత్ పై అర్థంపర్థంలేని ఆరోపణలు చేయడం మానేసి తమ దేశంలో పరిస్థితిని చక్కదిద్దడంపై, ప్రజలకు సుపరిపాలన అందించడంపై దృష్టిపెట్టాలని త్యాగి హితవు పలికారు.

  • Related Posts

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌