మావల్లే మీకు జీతాలు వస్తున్నాయి: ఇంగ్లండ్ మాజీలపై సునీల్ గవాస్కర్ సెటైర్లు

నేటి భారత్ న్యూస్- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు సెమీస్ కు చేరుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. తమ జట్టు ఓటమి గురించి మాట్లాడకుండా… భారత్ విజయాలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. భద్రతా కారణాలరీత్యా పాకిస్థాన్ కు భారత జట్టును బీసీసీఐ పంపించని సంగతి తెలిసిందే. దీంతో భారత్ ఆడే మ్యాచ్ లన్నింటినీ దుబాయ్ లో ఐసీసీ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీలు (నాజర్ హుస్సేన్, మైక్ ఆర్థర్టన్) మాట్లాడుతూ… ఒకేచోట అన్ని మ్యాచ్ లు ఆడటం ఇండియాకు ప్రయోజనకరంగా మారిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఇంగ్లండ్ మాజీలపై సెటైర్లు వేశారు. ఇలాంటి కామెంట్లు చేయడం మానేసి… సొంత జట్టుపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు. సెమీస్ కు ఇంగ్లండ్ ఎందుకు అర్హత సాధించలేకపోయిందో సమీక్షించుకోవాలని… భారత జట్టుపై ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని గవాస్కర్ అన్నారు. అంచనాలను అందుకోవడంలో మీ ఆటగాళ్లు విఫలమైనట్టు అనిపిస్తోందని… ఈ ఫలితాన్ని జీర్ణించుకోలేని మానసిక స్థితిలో మీ ప్లేయర్స్ ఉన్నారని వ్యాఖ్యానించారు. దేశం కోసం ఆడేటప్పుడు ఎంతో బాధ్యత ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని గవాస్కర్ సూచించారు. భారత్ కు అలాంటి అవకాశం వచ్చింది, మాకు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ కు ఇండియా ఎంతో సేవ చేస్తోందని… ఆటపరంగానే కాకుండా, ఆర్థికపరంగా కూడా వెన్నుదన్నుగా నిలుస్తోందని అన్నారు. టీవీ, మీడియా హక్కుల ద్వారా భారీగా ఆదాయం వస్తోందని… మీకు వస్తున్న శాలరీలు కూడా పరోక్షంగా భారత్ వల్లే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చురక అంటించారు.

  • Related Posts

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌