పోసానిపై మరో కేసు… అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు

నేటి భారత్ – సినీ నటుడు పోసాని కృష్ణమురళిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులను దూషించిన కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ లో ఉన్నారు. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు మిగిలిన పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు.మరోవైపు గుంటూరు జిల్లా నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు. అయితే, తాము కోర్టు అనుమతి తీసుకున్నామని, ముందుగా పోసానిని తమకే అప్పగించాలని నరసరావుపేట పోలీసులు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోసానిపై ఒకేసారి మూడు పీటీ వారెంట్లు రావడంతో ఆయనను ముందుగా ఎవరికి అప్పగించాలనే దానిపై ఉన్నతాధికారులతో జైలు అధికారులు సమాలోచనలు చేశారు. దీనికి సంబంధించిన నిబంధనలను పరిశీలించారు. ఆ తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. 

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!