గిర్ అడవుల్లో మోదీ లయన్ సఫారీ… 

నేటి భారత్ – ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లోని గిర్ అడవుల్లో లయన్ సఫారీ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు మంత్రులు, అటవీశాఖ అధికారులు ఉన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఆయన సఫారీ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… “ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా గిర్ అడవుల్లో ఈ ఉదయం సఫారీకి వెళ్లాను. ఆసియా సింహాలకు గిర్ అటవీ ప్రాంతం నిలయమనే విషయం తెలిసిందే. గిర్ పర్యటన నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన ఎన్నో పనులకు సంబంధించిన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసింది. గత అనేక సంవత్సరాలుగా చేపట్టిన సమష్టి ప్రయత్నాల కారణంగా ఆసియా సింహాల జనాభా క్రమంగా పెరుగుతోంది. ఆసియా సింహాల ఆవాసాలను సంరక్షించడంలో గిరిజన సమూహాలు, చుట్టుపక్కల ప్రాంతాల మహిళల పాత్ర కూడా ప్రశంసనీయం.అపురూపమైన జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలోని ప్రజలంతా కృషి చేయాలి. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వన్యప్రాణుల సంరక్షణలో భారత్ చేస్తున్న కృషికి గర్విస్తున్నా” అని ట్వీట్ చేశారు. అందరూ గిర్ అడవులను సందర్శించాలని సూచించారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌