దుబాయ్‌లో సంబరాలు చేసుకున్నాడన్న రేవంత్ రెడ్డి విమర్శలపై స్పందించిన హరీశ్ రావు

నేటి భారత్ – ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగిన రోజు తాను దుబాయ్‌లో సంబరాలు చేసుకున్నానని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు.ప్రమాదం జరిగిన రోజు హరీశ్ రావు దుబాయ్‌లో దావత్ చేసుకున్నారని, రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చి రాజకీయం చేశాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు కదా, మీరేమంటారని టీవీ9 మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయానికి ఇది నిదర్శనమని  హరీశ్ రావు బదులిచ్చారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు పెళ్లి వేడుకకు తాను దుబాయ్‌కి ఈ నెల 21న వెళ్లానని, ఎస్ఎల్‌బీసీ ప్రమాదం ఈ నెల 22వ తేదీ ఉదయం జరిగిందని, మధ్యాహ్నానికి ఈ ప్రమాదం వెలుగు చూసిందని గుర్తు చేశారుసహచర ఎమ్మెల్యే ఇంట్లో వేడుకకు వెళ్లడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించాల్సింది ప్రభుత్వమా? లేక ప్రతిపక్ష ఎమ్మెల్యేనా? అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగా భావిస్తున్నాడని చురక అంటించారు. తన తప్పును దాచుకోవడానికి రేవంత్ రెడ్డి గొంతు పెంచి మాట్లాడతాడని అన్నారు. ప్రతిపక్షాల మీద బురద జల్లి ప్రతి అంశాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారని అన్నారు.ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యమే అని హరీశ్ రావు ఆరోపించారు. వారు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్‌బీసీ పనులు జరగలేదని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌