ఉక్రెయిన్‌కు ట్రంప్ షాక్.. మిలటరీ సాయం నిలిపివేత

నేటి భారత్ – రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాకిచ్చారు. ఆ దేశానికి అందిస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారు. అమెరికా శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో మాటల యుద్ధం తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.అధ్యక్షుడు (ట్రంప్) శాంతి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని, తమ భాగస్వాములందరూ ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు. తాము అందిస్తున్న సాయం సమస్య పరిష్కారానికి పనికొస్తుందా? లేదా? అన్నదానిపై సమీక్షిస్తామని, అందుకే సాయాన్ని నిలిపివేసినట్టు పేర్కొన్నారు.శుక్రవారం వైట్‌హౌస్‌లో రష్యా-ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం వాడీవేడిగా సాగింది. రష్యాతో యుద్ధంలో సాయం చేస్తున్నా ఉక్రెయిన్ తమకు కృతజ్ఞతగా ఉండటం లేదని ట్రంప్ నిందించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు తీసుకెళుతూ పోలండ్‌లోని ట్రాన్సిట్ ఏరియాలో ఉన్న నౌకలు, విమానాలను అక్కడే నిలిపివేయనున్నట్టు వైట్‌హౌస్ అధికారి తెలిపారు. కాగా, జెలెన్‌స్కీపై ట్రంప్ నిన్న కూడా విరుచుకుపడ్డారు. మరోవైపు, రష్యాతో యుద్ధం ముగింపు అంశం చాలా దూరంలో ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. 

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌