ఆర్బీఐ కీలక నిర్ణయం

నేటి భారత్ న్యూస్- దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులను జొప్పించేందుకు ఆర్బీఐ మరోసారి చర్యలు ప్రకటించింది. ఏ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థలకు నిధులు అందుబాటులోకి తీసుకొస్తామనే ప్రక్రియను వెల్లడించింది. బహిరంగ మార్కెట్ కార్యక్రమాల ద్వారా సెక్యూరిటీ‌ల కొనుగోలు, డాలర్, రూపాయి స్వాప్ వంటి చర్యల ద్వారా నెల రోజుల్లో మొత్తం రూ.1.9 లక్షల కోట్లు బ్యాంకులకు అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న పది బిలియన్ డాలర్లకు సమానమైన డాలర్ – రుపాయి స్వాప్ వేలాన్ని నిర్వహించిన ఆర్బీఐ .. లిక్విడిటీని మరింత పెంచాలని మరోసారి చర్యలు తీసుకుంది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా మొత్తం రూ.1 లక్ష కోట్లకు సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తామని ఆర్బీఐ ప్రకటించింది. రూ.50వేల కోట్ల చొప్పున రెండుసార్లుగా మార్చి 12, మార్చి 18 తేదీల్లో ఈ సెక్యూరిటీస్ కొనుగోళ్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు మార్చి 24న మరో పది బిలియన్ డాలర్ల యూఎస్డీ, ఐఎన్ఆర్ బై, సెల్ స్వాప్ వేలాన్ని కూడా నిర్వహించనుంది. నగదు లభ్యతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ తెలిపారు. 

Related Posts

నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ

నేటి భారత్ న్యూస్- ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన ‘కోర్ట్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తొలి షోతోనే ఈ చిత్రం హిట్ టాక్ ను సంపాదించుకుంది. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని…

జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు

నేటి భారత్ న్యూస్- తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్ గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సెషన్ మొత్తానికి ఆయనను సస్పెండ్ చేశారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ

నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ

జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు

జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు

 ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని

 ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని

ఏనాడైనా ప్రజల్లో తిరిగారా..? జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్

ఏనాడైనా ప్రజల్లో తిరిగారా..? జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్

పారిశుద్ధ్య కార్మికుల‌తో సీఎం చంద్ర‌బాబు ముఖాముఖి

పారిశుద్ధ్య కార్మికుల‌తో సీఎం చంద్ర‌బాబు ముఖాముఖి

 విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

 విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు