కొమరయ్య, అంజిరెడ్డికి ప్రధాని మోదీ అభినందన

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ తరపున ఎమ్మెల్సీలుగా గెలుపొందిన మల్క కొమరయ్య, అంజిరెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజతకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో మమేకమై పనిచేస్తున్న తమ పార్టీ కార్యకర్తలను చూసి గర్విస్తున్నానని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంపై నేతలు దృష్టి సారిస్తున్నారు.ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు కూడా మోదీ అభినందనలు తెలిపారు. కేంద్రంలోను, ఏపీలోను ఎన్డీయే ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళతాయని అన్నారు.

Related Posts

 విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

నేటి భారత్ న్యూస్- విశాఖపట్నంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయాలు ప్రారంభమైన నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో టికెట్ల కోసం ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. విశాఖలో ఈ నెల 24న ఢిల్లీ-లక్నో, 30న ఢిల్లీ-హైదరాబాద్…

బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్.. త్వరలోనే భూమ్మీదకు సునీతా విలియమ్స్

నేటి భారత్ న్యూస్- దాదాపు 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్  విల్‌మోర్ త్వరలోనే తిరిగి భూమ్మీద అడుగుపెట్టనున్నారు. వీరిని తీసుకొచ్చేందుకు నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నాసా-స్పేస్ఎక్స్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

 విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్.. త్వరలోనే భూమ్మీదకు సునీతా విలియమ్స్

బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్.. త్వరలోనే భూమ్మీదకు సునీతా విలియమ్స్

 వెంకటపాలెంలో శ్రీనివాస కల్యాణం… మంత్రి నారా లోకేశ్ కు టీటీడీ ఆహ్వానం

 వెంకటపాలెంలో శ్రీనివాస కల్యాణం… మంత్రి నారా లోకేశ్ కు టీటీడీ ఆహ్వానం

ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే కనుక బతికిపోతారు.. ట్రంప్‌తో పుతిన్

ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే కనుక బతికిపోతారు.. ట్రంప్‌తో పుతిన్

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌