నిద్రపోయి ఔటైన పాకిస్థాన్ బ్యాటర్ షకీల్.. పాక్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా చెత్త రికార్డు

నేటి భారత్ న్యూస్- పాకిస్థాన్ బ్యాటర్ సౌద్ షకీల్ అనూహ్యంగా ఔటయ్యాడు. ప్రెసిడెంట్స్ కప్ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఫైనల్‌ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్‌కు దిగాల్సిన వేళ డ్రెస్సింగ్ రూములో నిద్రపోయి ఆలస్యంగా క్రీజులోకి చేరుకున్నాడు. దీంతో అంపైర్ అతడిని టైమ్‌డ్ ఔట్‌గా ప్రకటించారు. మంగళవారం పీటీవీతో జరిగిన మ్యాచ్‌లో షకీల్ స్టేట్ బ్యాంకు తరపున బరిలోకి దిగాడు. రంజాన్ మాసం కావడంతో రాత్రి 7.30 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల వరకు మ్యాచ్ నిర్వహించారు. పేసర్ మహ్మద్ షాజాద్ రెండు వరుస బంతుల్లో ఉమర్ అమీన్, ఫవాద్ ఆలంను పెవిలియన్ పంపాడు. ఈ క్రమంలో మూడు నిమిషాల్లోపు మరో బ్యాటర్ క్రీజులోకి రావాల్సి ఉండగా షకీల్ ఆ వ్యవధి దాటిన తర్వాత క్రీజులోకి వచ్చి గార్డ్ తీసుకున్నాడు. అయితే, పీటీవీ కెప్టెన్ అమ్మాద్ బట్ అప్పీల్ చేయడంతో షకీల్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఇలా టైమ్‌డ్ ఔట్ అయిన ఏడో బ్యాటర్‌గా, పాక్ చరిత్రలో ఇలా ఔటైన తొలి ఆటగాడిగా షకీల్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌