పోలీసుల కాల్పుల్లో చనిపోదామని వైట్ హౌస్ సమీపంలో గన్ తీశాడు.. చివరికి ఆసుపత్రి పాలయ్యాడు

నేటి భారత్ న్యూస్- వైట్‌హౌస్ సమీపంలో ఆదివారం ఉదయం ఒక వ్యక్తి తుపాకీతో హల్‌చల్ చేయడంతో కలకలం రేగింది. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతడిని అడ్డుకునే క్రమంలో కాల్పులు జరపడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడిని ఇండియానాకు చెందిన 27 ఏళ్ల ఆండ్రూ డాసన్‌గా గుర్తించారు. డాసన్ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో వైట్‌హౌస్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం, అతని వద్ద తుపాకీతో పాటు ఒక కత్తి కూడా ఉంది. వెస్ట్ వింగ్ నుండి కొద్ది దూరంలో ఉన్న ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్ వద్ద సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని గుర్తించి నిలువరించే ప్రయత్నం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, డాసన్ గతంలో కూడా స్థానిక చట్ట అమలు సంస్థల దృష్టికి వచ్చాడు. వాషింగ్టన్, డి.సి. ప్రాంతానికి వెళ్ళే ముందు అతను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఇండియానా అధికారులు వెల్లడించారు. పోలీసుల చేతిలో కాల్పులకు గురై చనిపోవాలనే ఉద్దేశంతోనే అతడు అక్కడికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లిల్మి తెలిపిన వివరాల ప్రకారం, ఏజెంట్లు అతన్ని సమీపిస్తుండగా డాసన్ తుపాకీ తీయడంతో వెంటనే కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. కోర్టు రికార్డుల ప్రకారం, డాసన్ 2018లో గంజాయి మరియు డ్రగ్ సంబంధిత వస్తువులను కలిగి ఉన్నందుకు అరెస్టయ్యాడు. ఈ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో ఉన్నారని సీక్రెట్ సర్వీస్ తెలిపింది. ఈ ఘటనపై మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇంటర్నల్ అఫైర్స్ డివిజన్ దర్యాప్తు చేస్తోంది.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌