

నేటి భారత్ న్యూస్- ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం నుంచి సరైన సమాధానాలు రావడం లేదని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. 2014 నుంచి జరిగిన స్కామ్ లపై మాట్లాడాలని తాము అడిగామని. అమరావతి భూములు, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, అగ్రిగోల్డ్ దందాలు అన్నింటిపై విచారణ జరపాలని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ను భూబకాసురుడు అని అనడం సరికాదని చెప్పారు. నిరాధార ఆధారాలు చేయడం సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వానికి దశ, దిశ లేదని బొత్స విమర్శించారు. తమపై వచ్చిన ఆరోపణలను తాము ఖండించలేదని. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలని కోరుతున్నామని చెప్పారు. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. అమరావతిలో జరిగింది భూకుంభకోణమని ఆరోపించారు. ఏ అంశంపై చర్చ జరిగినా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే తాము సమాధానాలు చెప్పలేమని అన్నారు.