అంగట్లో అమెరికా సిటిజన్ షిప్.. రూ.44 కోట్లిస్తే గోల్డ్ కార్డ్ తో స్వాగతిస్తామంటున్న ట్రంప్

నేటి భారత్ న్యూస్- అమెరికాలో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్న సంపన్నులకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ఆఫర్ ను తీసుకురాబోతున్నారు. సిటిజన్ షిప్ (పౌరసత్వం)ను అంగట్లో అమ్మకానికి పెట్టబోతున్నారు. 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.44 కోట్లు) చెల్లిస్తే ‘గోల్డ్ కార్డ్’ ద్వారా అమెరికాలో నివసించేందుకు అనుమతించనున్నట్లు తెలిపారు. గ్రీన్ కార్డ్ ద్వారా పొందే అన్ని సౌకర్యాలను ఈ గోల్డ్ కార్డ్ తో పొందవచ్చని, దీంతో సిటిజన్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. మొత్తంగా పది లక్షల గోల్డ్ కార్డ్ లను విక్రయించాలని ట్రంప్ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉన్నప్పటికీ త్వరలోనే ఈ గోల్డ్ కార్డ్ ను ట్రంప్ అంగట్లోకి తీసుకురావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఇలా డబ్బులతో అమెరికా సిటిజన్ షిప్ కొనుక్కునే విధానం ఇప్పటికే అమలులో ఉందని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఈబీ-5 పోగ్రాం కింద విదేశీయులు గ్రీన్ కార్డ్ పొందే వెసులుబాటు ఉందన్నారు. ఇందుకోసం అమెరికాలో 8 లక్షల డాలర్ల నుంచి 20 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ వ్యాపారం ద్వారా కనీసం పదిమంది అమెరికన్లకు శాశ్వత ఉద్యోగం లభించాలి. పెట్టుబడులను కనీసం రెండేళ్ల పాటు కదిలించకూడదనే షరతులు ఈబీ-5 పోగ్రాంలో ఉన్నాయి. ఈ నిబంధనలను పాటించిన వారికి ఈబీ-5 పోగ్రాం కింద అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డ్ అందజేస్తుంది.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!