అక్రమంగా చేపలు పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

నిజాంపేట,మెదక్ జిల్లా,ఫిబ్రవరి 23, ( నేటి భారత్ దినపత్రిక ) : నిజాంపేట మండలం బచ్చురాజ్ పల్లి గ్రామ శివారులో గల జడ్ చెర్వు లో అక్రమంగా చేపలు పడుతున్నా వారిపై మండల పోలీస్ స్టేషన్ లో గ్రామ మత్స్యకారుల ముదిరాజ్ సంఘం సభ్యులు పిర్యాదు చేశారు,ఈ సందర్భంగా మత్స్యకారుల ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ బచ్చురాజు పల్లి పరిధిలో గల జెడ్ చెరువులో కొందరు వ్యక్తులు అక్రమంగా చేపలు పడుతున్నారని వారికి చేపలు పట్టవద్దని అనేకసార్లు చెప్పిన వినటం లేదని వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని నిజాంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు,ఈ చెరువులో చేపలు పట్టే హక్కు మత్స్యకారులకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్,దుర్గోళ్ల రాజు,చంద్రశేఖర్,శ్రీను,రవి,మల్లేశం,లింగం,చంద్రం,స్వామి గ్రామ మత్స్యకార సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు

    నేటి భారత్ న్యూస్- తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్ గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సెషన్ మొత్తానికి ఆయనను సస్పెండ్ చేశారు. ఈ…

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    నేటి భారత్ న్యూస్- విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో భాగంగా గుజరాత్ జెయింట్స్ విమెన్ జట్టుతో ముంబైలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ విమెన్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే వంతెన ..

    అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే వంతెన ..

    మ‌రోసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా.. ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుడు

    మ‌రోసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా.. ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుడు

     రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు .. ఎందుకంటే..?

     రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు .. ఎందుకంటే..?

    నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ

    నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ

    జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు

    జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు

     ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని

     ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని