అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్

నేటి భారత్ న్యూస్- ఆంధప్రదేశ్‌లో రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ నిర్ణయించింది. అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో నెలకొల్పనున్న ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి ఉపాధి లభించనుంది. కాగా, 2007 నుంచి విశాఖ పరిసర ప్రాంతాల్లో లారస్ సంస్థ రూ. 6,500 కోట్ల పెట్టుబడితో పలు యూనిట్లు నెలకొల్పింది. వాటి ద్వారా దాదాపు 10 వేల మందికి ఉపాధి లభిస్తోంది. లారస్ సంస్థ సీఈవో చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు నిన్న రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఈ యూనిట్ ద్వారా ఫర్మెంటేషన్, క్రాప్ సైన్స్ కెమికల్స్, గ్రీన్ కెమిస్ట్రీ వంటి ప్రత్యేక రసాయనాలను తయారు చేస్తుందని తెలిపారు. లారస్ సంస్థకు భూ కేటాయింపులతోపాటు అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని, వీలైనంత త్వరగా నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం కోరారు.

Related Posts

శ్రీరామనవమికి ఒక రోజు ముందుగానే… ఈరోజు భద్రాచలంకు వెళుతున్న పవన్ కల్యాణ్

నేటి భారత్ న్యూస్- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు భద్రాచలంకు వెళుతున్నారు. రేపు భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. పండుగరోజుకు ఒక్క రోజు ముందుగానే పవన్ భద్రాచలంకు వెళుతున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను సీతారాముల…

 నేటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ!

నేటి భారత్ న్యూస్- ఐపీఎల్‌లో భాగంగా నేడు ఢిల్లీ కేపిటల్స్‌తో చెపాక్‌లో జరగనున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మహేంద్రసింగ్ ధోనీ నడిపించనున్నట్టు తెలుస్తోంది. గాయం కారణంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో ఉండటం అనుమానంగా ఉంది. రుతురాజ్ కనుక…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

శ్రీరామనవమికి ఒక రోజు ముందుగానే… ఈరోజు భద్రాచలంకు వెళుతున్న పవన్ కల్యాణ్

శ్రీరామనవమికి ఒక రోజు ముందుగానే… ఈరోజు భద్రాచలంకు వెళుతున్న పవన్ కల్యాణ్

 నేటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ!

 నేటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ!

అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్

అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్

ఐపీఎల్‌లో కేకేఆర్ అరుదైన ఘ‌న‌త‌.. తొలి జ‌ట్టుగా న‌యా రికార్డ్!

ఐపీఎల్‌లో కేకేఆర్ అరుదైన ఘ‌న‌త‌.. తొలి జ‌ట్టుగా న‌యా రికార్డ్!

చైనీయులతో ప్రేమ‌, పెళ్లి, శారీరక సంబంధాలు వద్దు: అమెరికా

చైనీయులతో ప్రేమ‌, పెళ్లి, శారీరక సంబంధాలు వద్దు: అమెరికా

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్