అమెరికాలో తుపాను బీభత్సం.. కొనసాగుతున్న టోర్నడోల విధ్వంసం

నేటి భారత్ న్యూస్- అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా, వర్జీనియా రాష్ట్రాల్లో అధికారులు టోర్నడో హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కరోలినాలో బలమైన గాలుల కారణంగా పలు నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. మిసిసిపీలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓక్లహామాలో పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. టెక్సాస్, ఓక్లహామా, లూసియానాలలో ఇప్పటికే ఏడు టోర్నడోలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గాలులు తీవ్రంగా వీస్తుండటంతో టెక్సాస్‌లోని శాన్ పాట్రిసియో కౌంటీలో సంభవించిన కార్చిచ్చు కారణంగా 20కిపైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.  పసిఫిక్ ప్రాంతం నుంచి రాబోతున్న పెను తుపాను కారణంగా నేడు భారీ వర్షాలు, హిమపాతం సంభవించనున్నట్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంచు దట్టంగా కురుస్తుండటంతో పలుచోట్ల రహదారులను మూసివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా టెక్సాస్‌లోని దాదాపు 51 వేల ఇళ్లు, వర్జీనియాలో 27 వేలు, టెన్నెసీలో 17 వేల ఇళ్లు, కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దాదాపు 800 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతాన్ని గురువారం ఆల్ఫ్రెడ్ తుపాను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీని కారణంగా భారీ వర్షాలు కురవడంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వందల సంఖ్యలో పాఠశాలలను మూసివేశారు. క్వీన్స్‌లాండ్ బ్రిస్బేన్ నగరంపై ఈ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. న్యూ సౌత్‌వేల్స్ లో 4,500 ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌