ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం

నేటి భారత్ న్యూస్-బెట్టింగ్ యాప్ లు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. వీటి బారిన పడిన ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ యాప్ లను సినీ నటులు, యూట్యూబర్లు, క్రీడాకారులు ప్రమోట్ చేస్తుండటంతో… ఎంతోమంది వీటికి ఆకర్షితులవుతున్నారు. ఒక్కసారి బెట్టింగ్ వలలో పడ్డారంటే… ఇక బయట పడటం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం కలకలం రేపుతోంది. ఈ యాప్ లను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలు కేసులు ఎదుర్కొంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపుదామని ఆయన అన్నారు. బెట్టింగ్ లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొద్దామని తెలిపారు. మనం తీసుకునే నిర్ణయాలు ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ను పూర్తిగా అరికట్టేలా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో నేరాలు తగ్గినప్పటికీ… ఆర్థిక నేరాలు పెరిగాయని చంద్రబాబు చెప్పారు. గంజాయి సాగు కూడా తగ్గిందని తెలిపారు. నేరస్తులు చాలా తెలివిగా ఉంటారని… సాక్ష్యాలు దొరకకుండా మాయం చేస్తారని చెప్పారు. నేరస్తుల్లో కొందరు పారిపోతారని…. మరికొందరు నేరాన్ని పక్క వ్యక్తులపై తోసేస్తారని… వైఎస్ వివేకా హత్య కేసు దీనికి ఉదాహరణ అని అన్నారు. నేరాలను తగ్గించేందుకు పోలీసులు టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మావోయిస్టుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం కూడా తీసుకోవాలని చెప్పారు.

Related Posts

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని…

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

నేటి భారత్ న్యూస్- హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇక్కడి కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న ‘ఆనం మీర్జా’ ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుకాణదారుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!