ఆస‌క్తిక‌ర పోస్ట‌ర్‌తో ‘కుబేర’ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌

నేటి భారత్ న్యూస్-టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖర్ కమ్ముల పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో అక్కినేని నాగార్జున, త‌మిళ‌ హీరో ధనుశ్ నటిస్తున్నారు. అలాగే రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది.  ఈ మేర‌కు ప్ర‌త్యేక పోస్ట‌ర్ ద్వారా కుబేర విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. జూన్ 20న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపారు. కాగా, తాజాగా రిలీజైన పోస్టర్‌ను చిత్ర బృందం ఆస‌క్తిక‌రంగా రూపొందించింది. ఇక ఇప్పటికే సినిమా నుంచి నాగార్జున, ధనుశ్, రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుద‌ల‌ చేశారు. అలాగే ర‌ష్మిక‌ క్యారెక్టర్ గ్లింప్స్ తో పాటు టీజ‌ర్ కూడా విడుదలైంది. ఇక ఈ చిత్రం భిన్న‌మైన సోష‌ల్ డ్రామా క‌థాంశంతో తెరకెక్కుతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో ధ‌నుశ్‌ను చాలా కొత్తగా చూపించ‌బోతున్నార‌ని టాక్‌. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీవెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌లో సునీల్ నారంగ్‌, రామ్మోహన్ ‌రావు కలిసి నిర్మిస్తున్నారు. 

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌