ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

నేటి భారత్ న్యూస్-‘‘మూడేళ్ల తర్వాత అధికారం మనదే. అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా, అప్పటి వరకు ధైర్యంగా ఉండు’’ అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్‌కు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అభయమిచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో రెండో నిందితుడైన సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు రెండ్రోజుల క్రితం పులివెందుల పోలీసులు పవన్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ‘వైఎస్ అవినాశ్ అన్న యూత్’ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న పవన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.ఈ నేపథ్యంలో నిన్న పులివెందులలో పర్యటించిన జగన్‌ను పవన్ కుమార్‌ కలిశారు. విచారణ పేరుతో డీఎస్పీ, సీఐ తనను కొట్టారంటూ ఫిర్యాదు చేశారు. స్పందించిన జగన్ ఆయనను ఓదార్చారు. మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి రాగానే  ఆ డీఎస్పీ, సీఐతో సెల్యూట్ కొట్టిస్తానని, అంతవరకు ధైర్యంగా ఉండాలని కోరారు. కాగా, నేడు మరోమారు విచారణకు రావాలంటూ పవన్‌కుమార్‌కు పోలీసులు ఇప్పటికే 41ఏ నోటీసులు ఇచ్చారు.

Related Posts

 ఐపీఎల్‌లో ర‌షీద్ ఖాన్ అరుదైన ఘ‌న‌త‌.. జస్ప్రీత్ బుమ్రాను అధిగమించిన స్పిన్న‌ర్‌!

నేటి భారత్ న్యూస్- ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ)కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ ఆఫ్ఘ‌నిస్థాన్ స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అత్యంత వేగంగా 150 వికెట్ల మైలురాయిని చేరుకున్న బౌల‌ర్ల జాబితాలో మూడో స్థానంలో…

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

నేటి భారత్ న్యూస్- గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై మాజీ మంత్రి హరీశ్ రావు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం 2021లో ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 ఐపీఎల్‌లో ర‌షీద్ ఖాన్ అరుదైన ఘ‌న‌త‌.. జస్ప్రీత్ బుమ్రాను అధిగమించిన స్పిన్న‌ర్‌!

 ఐపీఎల్‌లో ర‌షీద్ ఖాన్ అరుదైన ఘ‌న‌త‌.. జస్ప్రీత్ బుమ్రాను అధిగమించిన స్పిన్న‌ర్‌!

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

జ‌పాన్ అభిమానుల ప్రేమ‌కు తార‌క్ ఫిదా.. ఆస‌క్తిక‌ర వీడియో షేర్ చేసిన హీరో!

జ‌పాన్ అభిమానుల ప్రేమ‌కు తార‌క్ ఫిదా.. ఆస‌క్తిక‌ర వీడియో షేర్ చేసిన హీరో!

 కేటీఆర్ పై రెండు కేసులు నమోదు

 కేటీఆర్ పై రెండు కేసులు నమోదు

కాళేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదో ప్రపంచ వింత అని ప్రచారం చేయించారు: బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్

కాళేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదో ప్రపంచ వింత అని ప్రచారం చేయించారు: బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్

చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాపై కీలక అప్టేడ్

చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాపై కీలక అప్టేడ్