ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

నేటి భారత్ న్యూస్-సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం విశాఖపట్నంలో స్టూడియోల నిర్మాణానికి గతంలో ప్రభుత్వం భూములు కేటాయించింది. ఆ క్రమంలో ప్రముఖ నిర్మాత రామానాయుడు స్టూడియో నిర్మాణానికి 35 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ భూమిని స్టూడియో కోసం వినియోగించకుండా కొంత భూమిని లేఅవుట్లు వేసి విక్రయించే ప్రయత్నాలు జరిగాయి. ఆ నేపథ్యంలో విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు న్యాయపోరాటం ద్వారా లేఅవుట్ విక్రయాలను నిలుపుదల చేయించారు. తాజాగా ఆయన ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. రామానాయుడు స్టూడియోకు గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఈ స్టూడియో నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం 35 ఎకరాలను కేటాయించగా, అందులోని 15.17 ఎకరాల్లో లేఅవుట్లు వేసి విక్రయించాలని గత ప్రభుత్వ హయాంలో ప్రయత్నించారని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమిని స్టూడియో కోసం వినియోగించడం లేనందున ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు.

Related Posts

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ

నేటి భారత్ న్యూస్-పోలీస్ శాఖలో ప్రక్షాళన చర్యలు ప్రారంభమయ్యాయి. మొదట చిత్తూరు జిల్లాలో చేపట్టిన ఈ ప్రక్రియను, తాజాగా అన్నమయ్య జిల్లాలో కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 264 మంది సిబ్బందిని బదిలీ చేసిన అధికారులు, తాజాగా అన్నమయ్య జిల్లాలో 364 మంది…

భర్తను అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేసిన ముస్కాన్..

నేటి భారత్ న్యూస్- సంచలనం సృష్టించిన మీరట్ హత్య కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. కన్నబిడ్డ పుట్టిన రోజు కోసం లండన్ నుంచి వచ్చిన భర్త సౌరభ్‌ను ప్రియుడు సాహిల్‌ శుక్లాతో కలిసి దారుణంగా హతమార్చిన ముస్కాన్ రస్తోగి 11…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ

భర్తను అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేసిన ముస్కాన్..

భర్తను అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేసిన ముస్కాన్..

ఆ విషయంలో ట్రంప్ కంటే బైడెన్‌యే బెటర్‌!

ఆ విషయంలో ట్రంప్ కంటే బైడెన్‌యే బెటర్‌!

 ఐపీఎల్ ప్రారంభానికి ముందు వివాదానికి తెరతీసిన ఆర్సీబీ..

 ఐపీఎల్ ప్రారంభానికి ముందు వివాదానికి తెరతీసిన ఆర్సీబీ..