ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అధికారులకు ఈటల వార్నింగ్

నేటి భారత్ న్యూస్ – ఐఏఎస్ లు, ఐపీఎస్ లు పబ్లిక్ సర్వెంట్లు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హితవు పలికారు. ప్రభుత్వంలోని పెద్దలు చెప్పారని నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. తాము కూడా ఆరెంజ్ బుక్ మెయింటెయిన్ చేస్తున్నామని ఈటల చెప్పారు. రూల్స్ కు విరుద్ధంగా, ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న అధికారుల పేర్లను అందులో రాసుకుంటున్నామని తెలిపారు.సమయం వచ్చినపుడు లెక్కలతో బయటపెట్టి ఫలితం అనుభవించేలా చేస్తామని ఈటల పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. బాస్‌ల ఆదేశాల ప్రకారం కాకుండా, చట్టప్రకారం నడుచుకోవాలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఈటల సూచించారు.చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లుగా పనిచేస్తే ఎట్టి పరిస్థితుల్లోను ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్తే ప్రజలు బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని, ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో ముందుకు సాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ కు కూడా బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

  • Related Posts

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌