ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రొమాంటిక్ లవ్ స్టోరీ!

 నేటి భారత్ న్యూస్– యూత్ ఎప్పుడూ కూడా లవ్ స్టోరీస్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటుంది. అందుకు తగినట్టుగా లవ్ స్టోరీస్ ఎక్కువగా తెరపైకి వస్తుంటాయి. ఇక ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా వదలడానికి కొన్ని లవ్ స్టోరీస్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. అలా ఈ సారి ఫిబ్రవరి 14వ తేదీన తమిళంలో ‘2k లవ్ స్టోరీ’ విడుదలైంది.  జగ్ వీర్ – మీనాక్షి గోవిందరాజన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా కోసం కుర్రకారంతా చాలా కుతూహలంతో ఎదురుచూసింది. అయితే రిలీజ్ తరువాత ఈ సినిమా గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫ్లామ్స్ నుంచి పలకరించనుంది.  ఈ నెల 14వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లోను .. ‘ఆహా’ తమిళ్ లోను ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ కాలం స్నేహాలు ఎలా ఉన్నాయి? ప్రేమలు .. ఇతర రిలేషన్స్ ఎలా ఉన్నాయి? అనే అంశాల చుట్టూ తిరిగే కథ ఇది. థియేటర్ల నుంచి పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయిన ఈ సినిమా, ఓటీటీ వైవు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుందనేది చూడాలి మరి.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌