కుంభమేళా నుంచి తీసుకువచ్చిన నీళ్లు తాగేందుకు నిరాకరించిన రాజ్ థాకరే

నేటి భారత్ న్యూస్– గంగా నదిని ప్రక్షాళన చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ మహారాష్ట్ర  నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే విమర్శించారు. అందుకే, తన పార్టీ సభ్యుడు బాలా నందగావ్ కర్ కుంభమేళా నుంచి తీసుకువచ్చిన నీటిని తాగేందుకు తాను నిరాకరించానని థాకరే వెల్లడించారు. పింప్రి చించివాడ్ లో ఏర్పాటు చేసిన ఎంఎన్ఎస్ పార్టీ 19వ వ్యవస్థాపక దినోత్సవ సభలో రాజ్ థాకరే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కుంభమేళాకు వెళ్లిన ప్రజలు నీళ్లలో దిగి తమ ఒళ్లు రుద్దుకుంటూ స్నానాలు చేయడం సోషల్ మీడియాలో చూశాను. కుంభమేళాకు వెళ్లిన మా పార్టీ నేత నందగావ్ కర్ అక్కడి నీళ్లు కమండలంలో తీసుకువచ్చారు. ఆ నీటిని తాగమని నన్ను కోరారు. కానీ, అలాంటి నీటిని ఎవరు తాగుతారు?  మనం గతంలో కొవిడ్ వంటి మహమ్మారి నుంచి బతికి బయటపడ్డాం. అప్పట్లో మాస్కులు ధరించడం తప్పనిసరిగా ఉండేది. కానీ అలాంటి పరిణామాల నుంచి కూడా మనం ఏమీ నేర్చుకోలేదు. మతపరమైన పుణ్యస్నానాల పేరిట జనాలు పెద్దఎత్తున గుమికూడారు. మతవిశ్వాసాలు అర్థవంతంగా ఉండాలే తప్ప, మూఢనమ్మకాల వెంట ప్రజలు నడవడం సరికాదు. ప్రజలు తప్పనిసరిగా ఆలోచించాలి” అని రాజ్ థాకరే పేర్కొన్నారు. 

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌