

నేటి భారత్ న్యూస్- బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ లండన్ లోని ఆసుపత్రిలో చేరారు. క్యాన్సర్ తో బాధపడుతున్న చార్లెస్ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరినట్టు బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటించింది. చికిత్స కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో ఆయన మళ్లీ ఆసుపత్రిలో చేరారు. చార్లెస్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. కింగ్ చార్లెస్ వయసు 76 సంవత్సరాలు. కింగ్ చార్లెస్ ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో అధికారిక కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఆయనకు క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే, బెంగళూరుకు కూడా వచ్చి చికిత్స తీసుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. మరోవైపు, చార్లెస్ ఏ విధమైన క్యాన్సర్ తో బాధపడుతున్నారనే విషయాన్ని మాత్రం బకింగ్ హామ్ ప్యాలెస్ వెల్లడించలేదు. చార్లెస్ త్వరగా కోలుకుని ప్రజా విధుల్లో పాల్గొనాలని ప్యాలెస్ సందేశాన్ని విడుదల చేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.