

నేటి భారత్ న్యూస్- దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లలో ఎవరు కీలక పాత్రధారి అనే అంశంపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతో చర్చ జరిగింది. ఇప్పుడు మరోసారి అలాంటి చర్చకు క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కారణమయ్యాడు. ఇండియా పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగిన ఛాంపియన్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కి సంబంధించి రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పెట్టుకున్న ఓ తాజా వీడియో థంబ్ లైన్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. భారత్, పాకిస్థాన్ జట్ల కెప్టెన్ల వెనుక ఇద్దరు ప్లేయర్స్ వుంటారు. రోహిత్ శర్మ వెనుక ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్ పిక్‌కి గానూ అశ్విన్ తన ఫోటో మార్ఫ్ చేసి పెట్టుకుంటే, పాకిస్థాన్ ప్లేయర్‌కి మాత్రం ఎన్టీఆర్‌ది మార్ఫ్ చేసి రిలీజ్ చేశాడు. దీనితో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి వివాదానికి దారి తీసింది. ఆర్ఆర్ఆర్‌లో మెయిన్ లీడ్ రామ్ చరణ్ కావడంతోనే అశ్విన్ తన ఫేస్‌ను రామ్ చరణ్‌కు పెట్టుకున్నాడని, ఎన్టీఆర్‌ని పాకిస్థాన్ టీమ్ వ్యక్తికి సెట్ చేశాడని చెర్రీ అభిమానులు అంటున్నారు. అంతే కాకుండా ఇప్పటికైనా సినిమాలో మెయిన్ హీరో ఎవరో తెలుసుకోవాలంటూ రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రిగ్గర్ చేస్తున్నారు. పాకిస్థాన్ ప్లేయర్‌కి ఎన్టీఆర్ బాడీకి పెట్టడం దారుణమైన విషయం అని తారక్ అభిమానులు సోషల్ మీడియాలో అశ్విన్‌పై ఫైర్ అవుతున్నారు. ఇలా రవిచంద్రన్ అశ్విన్ .. ఎన్టీఆర్ అభిమానులను కెలికి సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాడు. దీంతో ఫ్యాన్స్ మధ్య వివాదం ఎప్పటికి చల్లారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అగ్రహంతో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు అశ్విన్ ఎటువంటి సమాధానం చెబుతాడో వేచి చూడాలి.