గ‌చ్చిబౌలి భూముల‌పై పోలీసుల కీల‌క ఆదేశాలు

నేటి భారత్ న్యూస్- కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్య‌వ‌హారంతో సంబంధం లేని వ్య‌క్తులు ఆ భూముల్లోకి వెళ్ల‌రాద‌ని స్ప‌ష్టం చేశారు. ఆంక్ష‌లు అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.  రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచ గ‌చ్చిబౌలి రెవెన్యూ స‌ర్వే నం.25లో గ‌ల 400 ఎకరాల భూమిపై ప్ర‌స్తుతం వివాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఈ భూముల విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ తీరుపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. తుది ఆదేశాలు జారీ చేసే వరకు ఈ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఒక్క రోజులో వంద‌ ఎక‌రాల్లో చెట్లు న‌రికేయ‌డం ఏంట‌ని న్యాయ‌స్థానం మండిప‌డింది.

Related Posts

Neti Bharath News Paper

Neti Bharath News Paper

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

జగ్జీవన్ రామ్ సేవలు మహోన్నతమైనవి: కేసీఆర్

జగ్జీవన్ రామ్ సేవలు మహోన్నతమైనవి: కేసీఆర్

గ‌చ్చిబౌలి భూముల‌పై పోలీసుల కీల‌క ఆదేశాలు

గ‌చ్చిబౌలి భూముల‌పై పోలీసుల కీల‌క ఆదేశాలు

 రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా కంచ గచ్చిబౌలి అడవిని ధ్వంసం చేస్తున్నారు: కేటీఆర్

 రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా కంచ గచ్చిబౌలి అడవిని ధ్వంసం చేస్తున్నారు: కేటీఆర్

హౌతీలను అమెరికా బలగాలు ఎలా హతమార్చాయో వీడియో విడుదల చేసిన ట్రంప్.

హౌతీలను అమెరికా బలగాలు ఎలా హతమార్చాయో వీడియో విడుదల చేసిన ట్రంప్.

 సరికొత్త కలర్ ఆప్షన్లతో మూడు వేరియంట్లలో హోండా సీబీ 350

 సరికొత్త కలర్ ఆప్షన్లతో మూడు వేరియంట్లలో హోండా సీబీ 350

 ‘అదుర్స్-2’ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

 ‘అదుర్స్-2’ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు