గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

నేటి భారత్ న్యూస్- తెలంగాణ ఫిల్మ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) గద్దర్ అవార్డుల దరఖాస్తులకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ, ఎంట్రీ ఫీజు వివరాలను వెల్లడించింది. గద్దర్ అవార్డులకు సంబంధించిన దరఖాస్తులు రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, బుక్స్-క్రిటిక్స్ విభాగాల్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ‘ది మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ పేరిట చెక్ లేదా డీడీ ద్వారా రుసుం చెల్లించాలని పేర్కొంది. ఎంట్రీ, దరఖాస్తు రుసుం వివరాలు ఇలా ఉన్నాయి. ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ ఫీజు రూ. 11,800, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్ రూ. 3,450, బుక్స్ అండ్ క్రిటిక్స్ రూ. 2,360, అన్ని విభాగాల్లో అప్లికేషన్లకు ఫీజు జీఎస్టీతో కలిపి రూ. 5,900గా నిర్ణయించింది. పైన పేర్కొన్న ఎంట్రీ ఫీజులు జీఎస్టీతో కలిపి ఉన్నాయి.

Related Posts

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

నేటి భారత్ న్యూస్- తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద డీఈఓ, ఎంఈఓ, త‌హ‌సీల్దారుల ఫోన్ నంబ‌ర్లు ఉంచారు. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే వారి దృష్టికి తీసుకెళ్లాల‌ని…

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

నేటి భారత్ న్యూస్- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమ‌ల‌ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి శ్రీవారి సేవ‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు అర్ధాంగి నారా భువనేశ్వరి, కుమారుడు రాష్ట్రమంత్రి నారా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

 ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం