చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్

నేటి భారత్ న్యూస్- పిఠాపురం నియోజకవర్గంలోన చిత్రాడలో మార్చి 14న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరగడం తెలిసిందే. జయకేతనం పేరిట నిర్వహించిన ఈ సభ విజయవంతంగా ముగిసిన సందర్భంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎన్డీయే పక్షాల నాయకులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమ మిత్రులు తమకు శుభాకాంక్షలు తెలిపారని… ఈ సందర్భంగా వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జనసేన పార్టీ భవిష్యత్తులో మరింత శక్తిమంతంగా ఎదగడంతో పాటు, సామాన్యుల గొంతుకగా పనిచేస్తూ, రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ సమైక్యత లక్ష్యంగా మరింత బాధ్యతగా వ్యవహరిస్తుందని ఆయన వివరించారు. ‘జయకేతనం’ బహిరంగ సభ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క జనసేన నాయకుడికి, జన సైనికులకు, వీర మహిళలకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వేదికపై కనిపించకపోయినా ఎంతో మంది కార్యకర్తలు ఈ వేడుక కోసం తెర వెనుక ఎంతో శ్రమించారని, వారి సహకారం వెలకట్టలేనిదని ఆయన అన్నారు. అంతేకాకుండా, ఈ వేడుకను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడానికి సహకరించిన పోలీసు శాఖకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఇతర పోలీసు సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా అధికార యంత్రాంగం, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సహకారానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్, ఇతర శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, వివిధ జిల్లాల నాయకులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ మరియు సభ్యులకు, వైద్య సేవలు అందించిన డాక్టర్ సెల్ బృందానికి, వాలంటీర్లకు, మీడియా సిబ్బందికి, జనసేన శతఘ్ని బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సాంస్కృతిక విభాగం, ఫుడ్ కమిటీ, స్టేజ్ డెకరేషన్ బృందం, పారిశుద్ధ్య సిబ్బందికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సభకు స్థలం ఇచ్చిన దాతలకు, పారిశుద్ధ్య సేవలు అందించిన సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బందికి, తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Related Posts

 ఈ నెల 29 న సూర్యగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుందంటే..?

నేటి భారత్ న్యూస్- కొత్త ఏడాదిలో తొలి సూర్యగ్రహణం ఈ నెల 29న ఏర్పడనుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అయినప్పటికీ భూమిపై నుంచి చూస్తే పాక్షికంగానే కనిపిస్తుందని వివరించారు. అదేవిధంగా ప్రపంచంలో కొన్ని దేశాలలో మాత్రమే గ్రహణం…

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతం… కానీ ఆ విష‌యం న‌న్ను బాధించింది: రాజ‌మౌళి

నేటి భారత్ న్యూస్- టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కాంబినేష‌న్‌లో ‘ఎస్ఎస్ఎంబీ 29’ ప్రాజెక్టు తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ మూవీ ఒడిశాలో షూటింగ్ జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా జ‌క్క‌న్న ఒడిశాలోని ప్ర‌ఖ్యాత…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 ఈ నెల 29 న సూర్యగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుందంటే..?

 ఈ నెల 29 న సూర్యగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుందంటే..?

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతం… కానీ ఆ విష‌యం న‌న్ను బాధించింది: రాజ‌మౌళి

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతం… కానీ ఆ విష‌యం న‌న్ను బాధించింది: రాజ‌మౌళి

నాగార్జున డ్యామ్ సమీపంలో అగ్నిప్రమాదం

నాగార్జున డ్యామ్ సమీపంలో అగ్నిప్రమాదం

ఐపీఎల్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం.. స్పందించిన ఆసీస్ మాజీ కెప్టెన్

ఐపీఎల్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం.. స్పందించిన ఆసీస్ మాజీ కెప్టెన్

 అశోక్ లేలాండ్ బస్ తయారీ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

 అశోక్ లేలాండ్ బస్ తయారీ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ..తెలంగాణ సర్కార్‌తో కీలక ఒప్పందం

హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ..తెలంగాణ సర్కార్‌తో కీలక ఒప్పందం