చెన్నైలో మాఫియా ముఠా సమావేశం జరుగుతోంది.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనుకొనే హాజరయ్యారు: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- చెన్నైలో జరిగిన మాఫియా ముఠా సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుకొనే హాజరయ్యాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేననే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ అవినీతికి పాల్పడ్డవేనని, పలు కుంభకోణాల్లో ఇరుక్కుపోయాయని అన్నారు. పలు కేసులకు సంబంధించి కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదని, కనీసం వారిని ముట్టుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని ఆయన అన్నారు. డీఎంకే నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ వెళ్లాయని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని మండిపడ్డారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పటి వరకు ప్రక్రియ ప్రారంభం కాలేదని, నియమ నిబంధనలు రూపొందించలేదని ఆయన తెలిపారు. ఆరు గ్యారెంటీల హామీల నుండి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజల దృష్టిని మరల్చేందుకు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ కేసుల నుండి తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తోందని అన్నారు. డీఎంకే రూ. 1,000 కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. అవినీతిమయ డీఎంకేకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేందుకు తమిళనాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు స్టాలిన్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ సమావేశానికి హాజరైన పార్టీలన్నీ బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు.

Related Posts

రేవంత్ రెడ్డి అప్పుడు, ఇప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై ఏడుస్తున్నారు: హరీశ్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై విమర్శలు చేశారని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ శాసనసభకు హాజరుకాకపోవడం వల్ల నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కావడం లేదని గజ్వేల్…

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

నేటి భారత్ న్యూస్-‘‘మూడేళ్ల తర్వాత అధికారం మనదే. అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా, అప్పటి వరకు ధైర్యంగా ఉండు’’ అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్‌కు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

రేవంత్ రెడ్డి అప్పుడు, ఇప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై ఏడుస్తున్నారు: హరీశ్ రావు

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి నారా లోకేశ్

రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి నారా లోకేశ్

నేపాల్‌లో వివాహ వయసు 20 నుంచి 18కి తగ్గింపు!

నేపాల్‌లో వివాహ వయసు 20 నుంచి 18కి తగ్గింపు!

మ‌హేంద్రుడా మ‌జాకా… వింటేజ్ ధోనీని గుర్తు చేశాడుగా..

మ‌హేంద్రుడా మ‌జాకా… వింటేజ్ ధోనీని గుర్తు చేశాడుగా..

 నేడు ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి ఆశవర్కర్ల పిలుపు .. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు

 నేడు ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి ఆశవర్కర్ల పిలుపు .. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు