ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి నిష్క్ర‌మ‌ణ‌.. పాక్ పేరిట ప‌లు చెత్త రికార్డుల న‌మోదు!

నేటి భారత్ న్యూస్- దాదాపు మూడు ద‌శాబ్దాల త‌ర్వాత ఛాంపియ‌న్స్ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓట‌మితో ఆతిథ్య జ‌ట్టు సెమీస్ చేర‌కుండానే నాకౌట్ ద‌శ నుంచే నిష్క్ర‌మించింది. నిన్న‌టి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ గెలిచి ఉంటే… పాక్‌కు సెమీ ఫైన‌ల్ ఆశ‌లు స‌జీవంగా ఉండేవి. కానీ, బంగ్లాను కివీస్ ఓడించింది. దీంతో గ్రూప్‌-ఏ నుంచి భార‌త్‌, న్యూజిలాండ్ సెమీస్‌కు దూసుకెళ్లాయి. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ ఇంటిముఖం ప‌ట్టాయి. ఇక పాక్ సెమీస్ చేర‌కుండానే టోర్నీ నుంచి నిష్క్ర‌మించ‌డం ప‌ట్ల పాకిస్థానీ ఫ్యాన్స్ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. చెత్త ఆట‌తో టోర్నీలో కొన‌సాగ‌లేరంటూ మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో పాక్ ప‌లు చెత్త రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకుంది. ఆతిథ్య జ‌ట్టు ఛాంపియ‌న్స్ ట్రోఫీలో లీగ్ ద‌శ నుంచే వైదొల‌గ‌డం గ‌త 16 ఏళ్ల‌లో ఇదే తొలిసారి. 2009 ఛాంపియ‌న్స్ ట్రోఫీలోనూ ద‌క్షిణాఫ్రికాకు ఇలాగే జ‌రిగింది. టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన స‌ఫారీలు.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడి, ఒక దాంట్లో గెలిచారు. దాంతో పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగున నిలిచి టోర్న‌మెంట్ నుంచి నిష్క్ర‌మించారు. 2017లో భార‌త్‌ను ఓడించి పాకిస్థాన్ ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచింది. దీంతో ఈసారి డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగింది. కానీ, నాకౌట్ ద‌శ‌ను దాట‌లేక‌పోయింది. త‌ద్వారా డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగి సెమీస్ చేర‌కుండానే లీగ్ ద‌శ‌లోనే నిష్క్ర‌మించిన జ‌ట్టుగా పాక్ మ‌రో చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకుంది. ఇంత‌కుముందు 2002లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ సంయుక్తంగా విజేత‌లుగా నిలిచిన భార‌త్‌, శ్రీలంక‌ల‌కు కూడా 2004లో ఇలాంటి ప‌రిస్థితి ఎదురైంది. అటు ఆస్ట్రేలియా కూడా 2009లో ఛాంపియ‌న్‌గా నిలిచి… 2013లో డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగింది. కానీ, ఆసీస్ లీగ్ ద‌శ‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా గెల‌వ‌కుండానే ఇంటిముఖం ప‌ట్టింది.

  • Related Posts

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌