టీడీఆర్ బాండ్లపై మూడు నెలల్లో క్లారిటీ : ఏపీ మంత్రి నారాయణ

నేటి భారత్ న్యూస్- గ‌త ప్ర‌భుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో జరిగిన అక్ర‌మాలతో పాటు అన్ని అంశాల‌పై మూడో నెలల్లో ఒక క్లారిటీ వస్తుందని, విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గ‌త ప్ర‌భుత్వ హయాంలో విశాఖ‌ప‌ట్నంలో టీడీఆర్ బాండ్ల జారీలో జ‌రిగిన అక్ర‌మాల‌పై రీజిన‌ల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్‌తో పాటు సీఐడీ విచార‌ణ కొన‌సాగుతుంద‌న్నారు. అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల సమయంలో విశాఖ‌ప‌ట్నం తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి నారాయ‌ణ ఈ మేరకు స‌మాధానం ఇచ్చారు.టీడీఆర్ బాండ్ల జారీలో ఒక్క విశాఖ‌ప‌ట్నంలోనే కాకుండా త‌ణుకు, తిరుప‌తిలో కూడా అక్ర‌మాలు జ‌రిగాయ‌ని మంత్రి తెలిపారు. త‌ణుకులో 63.24 కోట్ల విలువైన బాండ్లు ఇవ్వాల్సి ఉండ‌గా, 754 కోట్ల‌కు బాండ్లు జారీ చేశార‌ని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని భూమిని ఇచ్చి, ప‌ట్ట‌ణంలో ఉన్న ఇంటి అడ్ర‌స్ ఇవ్వ‌డంతో ఆ ఇంటి విలువ ఆధారంగా బాండ్లు జారీ చేసిన‌ట్లు మంత్రి వెల్లడించారుఇదే విధంగా తిరుప‌తిలో 170.99 కోట్ల విలువైన 29 బాండ్లు జారీ చేశార‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వంలో అక్ర‌మాలు జ‌ర‌గ‌డంతో తమ ప్ర‌భుత్వం రాగానే టీడీఆర్‌లు నిలిపివేశామ‌ని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 965 టీడీఆర్ బాండ్ల జారీ పెండింగ్‌లో వుందని మంత్రి వివరించారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌