ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని

నేటి భారత్ న్యూస్- కెనడా నూతన ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మార్క్ కార్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చారు. కెనడాని అమెరికాలో విలీనం చేసుకుంటామని ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదని… పొరపాటున కూడా ఆ ఆలోచన చేయవద్దని చెప్పారు.  కెనడాపై అమెరికా గౌరవం చూపించాలని… అంతవరకు అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలను కొనసాగిస్తామని మార్క్ కార్నీ తెలిపారు. కెనడాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పదేపదే చేస్తున్న ప్రకటనలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కెనడా సార్వభౌమాధికారం పట్ల గౌరవం చూపితేనే తాను ట్రంప్ ను కలుస్తానని చెప్పారు. మరోవైపు కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ తెలిపిన వివరాల ప్రకారం… కార్నీ-ట్రంప్ మధ్య చర్చల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

Related Posts

నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ

నేటి భారత్ న్యూస్- ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన ‘కోర్ట్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తొలి షోతోనే ఈ చిత్రం హిట్ టాక్ ను సంపాదించుకుంది. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని…

జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు

నేటి భారత్ న్యూస్- తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్ గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సెషన్ మొత్తానికి ఆయనను సస్పెండ్ చేశారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ

నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ

జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు

జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు

 ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని

 ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని

ఏనాడైనా ప్రజల్లో తిరిగారా..? జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్

ఏనాడైనా ప్రజల్లో తిరిగారా..? జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్