డ‌బ్ల్యూపీఎల్ చ‌రిత్ర‌లో తొలి సూప‌ర్ ఓవ‌ర్‌.. యూపీని వ‌రించిన విజ‌యం!

నేటి భారత్ న్యూస్- ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్)లో సంచ‌ల‌నం న‌మోదైంది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ), యూపీ వారియ‌ర్స్ (యూపీడ‌బ్ల్యూ) మ‌ధ్య హోరాహోరీగా సాగిన‌ మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. తొలుత ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 180 ప‌రుగులు చేసింది. అనంత‌రం ఛేద‌న‌లో యూపీ కూడా 20 ఓవ‌ర్ల‌లో 180 ర‌న్స్‌కే ఆలౌట్ అయింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో విజయానికి 18 ప‌రుగులు అవ‌స‌రం కాగా 17 ప‌రుగులే చేసింది. దీంతో టోర్నీ చ‌రిత్రలో తొలి‌సారి సూప‌ర్ ఓవ‌ర్ జ‌రిగింది. అయితే, సూప‌ర్ ఓవ‌ర్‌లో యూపీ వారియ‌ర్స్‌ సూప‌ర్ విక్ట‌రీ సాధించింది. మొద‌ట సూప‌ర్ ఓవ‌ర్‌లో యూపీ 8 ప‌రుగులు చేసింది. ఆ త‌ర్వాత 9 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్‌సీబీని యూపీ 4 ర‌న్స్‌కే క‌ట్ట‌డి చేసింది. ఆ జ‌ట్టు బౌల‌ర్ సోఫీ ఎకిల్‌స్ట‌న్ సూప‌ర్ ఓవ‌ర్‌లో కేవ‌లం నాలుగు ప‌రుగులే ఇచ్చి జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని అందించారు. 

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌