పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి… చంద్రబాబు కీలక ఆదేశాలు

నేటి భారత్ న్యూస్-రాజమండ్రి శివారులో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై వస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పాస్టర్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఈ ఘటనపై రాష్ట్రం హోం మంత్రి అనిత తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాలని ఆదేశించారు. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ మాట్లాడుతూ రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని… ఈ ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మరణించాడని చెప్పారు. హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై బయల్దేరిన ప్రవీణ్… అర్ధరాత్రి సమయంలో ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. రహదారి పైనుంచి ప్రమాదవశాత్తు కిందకు జారిపోయారని… వాహనం అతనిపై పడిపోవడంతో ఆయనకు బలమైన గాయాలయ్యాయని, ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఉదయం 9 గంటల వరకు ఆయనను ఎవరూ గమనించలేదని తెలిపారు. మరోవైపు, ప్రవీణ్ కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాలు రాజమండ్రిలో ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు విచారణకు ఆదేశించారు.

Related Posts

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని…

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

నేటి భారత్ న్యూస్- హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇక్కడి కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న ‘ఆనం మీర్జా’ ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుకాణదారుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!