ప్రగతి రథానికి పంక్చర్ వేశారు… తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్

నేటి భారత్ న్యూస్- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పేకమేడలా కూల్చేస్తుందని విమర్శించారు. ఈ బడ్జెట్ ద్వారా పదేళ్ల ప్రగతి చక్రానికి పంక్చర్ చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, ఈ బడ్జెట్ పేదల కష్టాలను తీర్చే విధంగా లేదని ఆయన అన్నారు. ఢిల్లీకి మూటలు పంపించడానికి ఉపయోగపడేలా బడ్జెట్ ఉందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలను బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ జరిగిందో లేదో కాంగ్రెస్ నాయకులకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రుణమాఫీకి సంబంధించి అంకెలు ఎందుకు మారాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. 

Related Posts

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతం… కానీ ఆ విష‌యం న‌న్ను బాధించింది: రాజ‌మౌళి

నేటి భారత్ న్యూస్- టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కాంబినేష‌న్‌లో ‘ఎస్ఎస్ఎంబీ 29’ ప్రాజెక్టు తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ మూవీ ఒడిశాలో షూటింగ్ జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా జ‌క్క‌న్న ఒడిశాలోని ప్ర‌ఖ్యాత…

నాగార్జున డ్యామ్ సమీపంలో అగ్నిప్రమాదం

నేటి భారత్ న్యూస్- నాగార్జున సాగర్ ప్రధాన డ్యామ్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. నల్గొండ జిల్లాలోని సాగర్ ప్రధాన డ్యామ్‌ను ఆనుకొని ఉన్న ఎర్త్ డ్యామ్ దిగువ భాగంలో ఎండు గడ్డికి మంటలు అంటుకున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతం… కానీ ఆ విష‌యం న‌న్ను బాధించింది: రాజ‌మౌళి

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతం… కానీ ఆ విష‌యం న‌న్ను బాధించింది: రాజ‌మౌళి

నాగార్జున డ్యామ్ సమీపంలో అగ్నిప్రమాదం

నాగార్జున డ్యామ్ సమీపంలో అగ్నిప్రమాదం

ఐపీఎల్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం.. స్పందించిన ఆసీస్ మాజీ కెప్టెన్

ఐపీఎల్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం.. స్పందించిన ఆసీస్ మాజీ కెప్టెన్

 అశోక్ లేలాండ్ బస్ తయారీ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

 అశోక్ లేలాండ్ బస్ తయారీ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ..తెలంగాణ సర్కార్‌తో కీలక ఒప్పందం

హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ..తెలంగాణ సర్కార్‌తో కీలక ఒప్పందం

ఉద్యోగులకు అమెజాన్ భారీ షాక్.. 14 వేల మంది తొలగింపునకు రంగం సిద్ధం!

ఉద్యోగులకు అమెజాన్ భారీ షాక్.. 14 వేల మంది తొలగింపునకు రంగం సిద్ధం!